E.G: కడియం మండలం వీరవరం గ్రామంలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో కే.ఎస్ రమేష్ రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. నానో యూరియా & బయో ఎరువులు వాడటం వల్ల అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వీ.హెచ్.ఏ పి.కనకయ్య, జనసేన నాయకులు ఆదిమూలం సాయిబాబా, గ్రామస్తులు పాల్గొన్నారు.