VZM: ఎరువుల కొరతపై విజయనగరం జిల్లా YCP ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మాజీ CM జగన్ పిలుపుమేరకు వివిధ గ్రామాల నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్నదాతలకు ఎరువులు అందజేయాలంటూ.. నినాదాలు చేపట్టారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి పాల్గొన్నారు.