E.G: నిడదవోలు శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ఈనెల 22వ తేదీ నుండి దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను మంత్రి కందుల దుర్గేష్ ఆలయ ఈవో & దేవస్థానం ఫౌండర్ దేవులపల్లి, అర్చకులు శర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.