ASR: సీపీఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు దిరిదో దేవ (34)అనే మావోయిస్టు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర అంశాలతో పాటు మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడంతో లొంగిపోయినట్లు తెలిపారు.