ELR: అగ్రహారంలోని పురావస్తు ప్రదర్శనశాల ఆకట్టుకుంటోంది. ప్రాచీన యుగం నుంచి మానవులు వాడిన వస్తువులు, నాణేలు, తాళపత్రాలు, శిలా సంపదలు, ఆయుధాలు, గ్రంథాలు ఇక్కడ భద్రపరిచారు. ప్రతి వస్తువు దగ్గర అధికారులు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. వీటిని స్కాన్ చేస్తే వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో ప్రత్యక్షమవుతాయి.