HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కొక్కుల సంపత్ కుమార్, అమెరికాలో ఈ నెల 10 నుంచి అక్టోబర్ 27 వరకు జరిగే ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ శిక్షణకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది దరఖాస్తుల నుంచి దేశం నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపిక కాగా, అందులో సంపత్ కుమార్ ఉన్నారు. సంపత్ పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.