MBNR: కాళోజీ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజీ తన కవిత్వం ద్వారా సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని అన్నారు.