ADB: తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ఉట్నూర్ న్యాయవాది పెందూర్ ప్రభాకర్ మంగళవారం ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ సమాజానికి న్యాయవాదిగా వారి సమస్యల పరిష్కరానికి మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.బాపురెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.