నేషన్స్ కప్ ఫుట్‌బాల్‌లో భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 3-2తో ఒమన్‌పై గెలిచింది. భారత్ తరఫున లలియాంజులా జితిన్, చంగ్తె, రాహుల్ బెకె స్కోర్ చేశారు. ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒమన్‌పై గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.