GDWL: జిల్లాలోని గోనుపాడు గ్రామానికి చెందిన తుర్కకాశ కార్మికులు, మాజీ సర్పంచ్ మాజీద్ ఆధ్వర్యంలో మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గీత, చేనేత, బీడీ కార్మికుల తరహాలో 40 ఏళ్లు నిండిన తుర్కకాశ కార్మికులకు రూ.3,000 పింఛన్, రిజర్వేషన్లు, కార్మిక బంధు కింద రూ.10 లక్షల సహాయం అందించాలని వారు కోరారు.