ADB : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో పలు కంపెనీల్లో ఉద్యోగాలను కల్పించుటకు ఈ నెల 10న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ఎంపికైన వారికి రూ.16 వేల నుంచి రూ.19 వేలు ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు. 18 సం.ల నుంచి 35సం.ల లోపు నిరుద్యోగులు అర్హులన్నారు.