NRML: గోవులు రక్షించడం మన బాధ్యత అని జిల్లా గోసేవా ప్రముఖ్ కొత్తకాపు నారాయణ అన్నారు. గో విజ్ఞాన పరీక్షల నిర్వహణ కోసం స్థానిక ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం 550 పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి సహాయపడే ఉత్పత్తులు గోవుల ద్వారా మనకు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.