ప్రకాశం: మార్కాపురం డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలులో ఉందని, వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని సోమవారం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలు, బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టరాదని ప్రజలకు సూచించారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.