ASR: చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలని కొయ్యూరు డిప్యూటీ ఎంపీడీవో ఎం.బాబూరావు పారిశుధ్య సిబ్బందికి సూచించారు. మంగళవారం ఎం.మాకవరం పంచాయతీలో సర్పంచ్ కోడా చింతల్లి రాజుబాబు, కార్యదర్శి శంకరరావుతో కలిసి ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దని సూచించారు.