WGL: జిల్లాలో BRS పార్టీకి అధ్యక్షుడు లేకుండా పోయింది. అధికారం కోల్పోయినప్పటి నుంచి లీడర్ లేక కేడర్ ఆందోళనలో ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలపై దృష్టి సారించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది తన నియోజకవర్గాన్ని వీడడం లేదు. రెండేళ్లుగా సారథి లేక, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.