KDP: వల్లూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం డీఎల్డీవో మైథిలి రికార్డులను పరిశీలించారు. 2021 నుంచి 2024 వరకు గల నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎంపీడీవో రఘురాం, డిప్యూటీ ఎంపీడీవో మురళి, సిబ్బంది పాల్గొన్నారు.