NLR: చేజర్ల మండలంలోని ఆదురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం కమిటీ ఛైర్మన్ పటాన్ శాన్వాజ్ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా భోజనాన్ని రుచి చూసి తనిఖీ చేశారు. భోజనం రుచి పై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. ప్రభుత్వం సూచించిన మెనూ అమలు చేయాలని తెలిపారు.