ADB: సిరికొండ మండలంలోని బోరింగూడ, రాంజిగూడ, సాత్మోరి మూడు గ్రామాల ప్రజలు పని నిమిత్తం సిరికొండ రావాలంటే ఒకటే మార్గం ఉంది. బోరింగూడ నుంచి చమన్ గుడి వెళ్లే మార్గంలో గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీ గుంత ఏర్పడింది. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి, రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామస్థులు కొరుతున్నారు.