TPT: TTD ఈవోగా మరోసారి అవకాశం దక్కించుకున్న అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి 11.30 మధ్య టీటీడీ ఈవో, బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మరోవైపు టీటీడీ ఈవోగా పని చేసి బదిలీ అయిన శ్యామల రావును అధికారులు, ఉద్యోగులు సత్కరించారు.