PPM: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన లోచర్ల రమేష్ సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. ఉప సంచాలకులుగా పదోన్నతిని పొంది బదిలీపై గుంటూరుకు వెళుతున్న రమేష్‌కు బుధవారం కలెక్టర్ ఆయన ఛాంబరులో దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాత్రికేయులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికపుడు సమాచారాన్ని చేరవేశారన్నారు.