KNR: తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలోని పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఏవో బుధవారం నేరుగా పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.