KKD: జగ్గంపేట పెన్షనర్ల భవనంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీసీఎస్ ఉద్యోగులకు ఇచ్చినట్లే పెన్షనర్లకు ఉద్యోగులకు డిఏ బకాయి పడిన అరియర్స్ తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.