KMR: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. ఈ ప్రమాదంలో ఓ గొర్రెల కాపరితో పాటు 26 గొర్రెలు మృతి చెందాయని. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు గొర్రెలను మేపుకుంటూ రహదారిపైకి రాగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.