BPT: ఉచిత బస్సు పథకం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికుల పట్ల ప్రభుత్వానికి కనికరం లేదని CITU జిల్లా కార్యదర్శి మజుందర్ అన్నారు. ఆటో వర్కర్స్కు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 18న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బాపట్లలో ఆవిష్కరించారు. ఆటో కార్మికులు నష్టపోకుండా ప్రతి డ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 30 వేలు చెల్లించాలన్నారు.