GNTR: పెదనందిపాడు ఆర్ట్స్, సైన్స్ కళాశాల అభివృద్ధి కోసం ఆ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ పారిశ్రామికవేత్త నల్లమోతు వెంకట రత్తయ్య రూ. 5 లక్షల విరాళం అందజేశారు. మంగళవారం కళాశాల అధ్యక్షుడు కాళహస్తి సత్యనారాయణకు ఆయన నగదు అందజేశారు. రత్తయ్య ఎరిస్ కంపెనీ ద్వారా ఎంతోమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారని కళాశాల అధ్యక్షుడు తెలిపారు.