NLG: ప్రైవేట్ హాస్పిటల్స్ , మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. వర్షాకాలంలో అనారోగ్యానికి గురైన ప్రజలపై ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. వైద్య పరీక్షలు, మందుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు దోపిడికి గురవుతున్నారని తెలిపారు.