AKP: నర్సీపట్నం మండల టీడీపీ అధ్యక్షునిగా సుకల అప్పలనాయుడును నియమిస్తూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని ధర్మసాగరం గ్రామానికి చెందిన ఆయన పార్టీలో సీనియర్ నాయకునిగా ఉన్నారు. ఈయన సతీమణి సుకల రమణమ్మ ప్రస్తుతం నర్సీపట్నం జడ్పీటీసీగా పనిచేస్తున్నారు . తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని అప్పలనాయుడు తెలిపారు.