MNCL: బెల్లంపల్లి మండలం బూధకలాన్ గ్రామంలో ఈనెల 6న గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో పోలీస్ కానిస్టేబుల్ శివ శంకర్‌పై కొందరు యువకులు దాడి చేశారని తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఇరువర్గాల గొడవ ఆపేందుకు ఘటనా స్థలానికి చేరుకుని వారించగా గణేశ్, మహేందర్‌తో పాటు మరికొంత మంది కానిస్టేబుల్‌పై దాడి చేశారన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.