KDP: ప్రొద్దుటూరులోని స్థానిక పవర్ హౌస్ వీధిలోని SPDCL ఈఈ కార్యాలయ ఆవరణలో ఈనెల 11న ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రమణారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.