BDK: తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ (TJMU) అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడిగా ఈలప్రోలు వీర రాఘవులు ఎన్నికయ్యారు. ఆయన మండల ప్రజలకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఎప్పుడైనా సంప్రదించవచ్చని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని ఆయన తెలిపారు.