CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండలో వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేందుకు దుకాణ గదులకు ఈనెల 16న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. ఇందులో భాగంగా 85 దుకాణాలకు వేలం నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 11 లోపు ఒక్కొక్క గదికి రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి, వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.