KNR: ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్(TUCC- అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెట్కు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.