GDWL: జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం డీఎస్పీ మొగిలయ్యతో కలిసి ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఎస్పీ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతంగా చేపట్టి ప్రమాదాలను నివారించాలని, రాత్రివేళల్లో గస్తీ పెంచి దొంగతనాలను అరికట్టాలని ఆయన ఆదేశించారు.