నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాజీనామా చేశారు. యువత తిరుగుబాటు కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, నేపాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.