చిత్తూరు: నగరపాలక సంస్థ రిసోర్స్ పర్సన్ బేబీ శ్వేత కలెక్టర్ సారూ నాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మెప్మా అధికారి రమణపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. రమణ ప్రోద్బలంతో భువనేశ్వరి, ఉషారాణి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. రమణ అసభ్యంగా ప్రవర్తించారని, ఆయనపై ఫిర్యాదు చేసినందుకే ఇలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.