లడఖ్‌లోని సియాచిన్ గ్లేషియర్‌లో విషాదం జరిగింది. భారీ హిమపాతంలో ఆర్మీ జవాన్లు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సియాచిన్ ప్రాంతంలో 60°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.