KMM: గుట్టల బజార్ మాంట్ ఫోర్ట్ హైస్కూల్లో సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా SI (సైబర్ సెక్యూరిటీ) పోలీస్ అధికారి ఎం.విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో పాటు సైబర్ నేరాలూ పెరుగుతున్నాయని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.