SRPT: పాలకవీడు మండలం జాన్ పహాడ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాధికారి అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు గణితం, ఇంగ్లీషులో ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్, స్కూల్ గేట్లు తక్షణమే పునరుద్ధరించి నివేదికను సమర్పించాలని హెచ్ఎం లింగయ్యను కోరారు.