AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబును దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అదేవిధంగా, అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందించారు.