TG: ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వానికి దమ్ముంటే లైడిటెక్టర్ టెస్ట్ చేయాలని అన్నారు. మీడియా ముందు తనకు, సీఎంకు లై డిటెక్టర్ చేయించండి అని సవాల్ విసిరారు. ఛార్జిషీట్ అనేది ప్రొసీజర్ లో భాగమే అని అన్నారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని మరోసారి ఉద్ఘాటించారు.