KDP: పులివెందులలోని శ్రీరామ టెంపుల్ సచివాలయ పరిధిలో మున్సిపల్ కమిషనర్ రాముడు ఆదేశాల మేరకు మంగళవారం వార్డు శానిటరీ సెక్రటరీలు మహిళలకు ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధం, తడి, పొడి చెత్త వేరుచేయు విధానంపై వివరించారు. అనంతరం పార్నపల్లి రోడ్డులోని టీ షాపులను తనిఖీ చేసి నాణ్యమైన టీ పొడిని వాడాలని సూచించారు.