WGL: నల్లబెల్లి మండల జూనియర్ అసిస్టెంట్ వాంకుడోత్ కల్పన ఆత్మహత్యాయత్నంపై ఇంజినీరింగ్ JAC రాష్ట్ర అధ్యక్షుడు రవి చిన్న స్పందించారు. మంగళవారం ఆసుపత్రిలో కల్పనను పరామర్శించి, ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వేధింపులకు కారణమైన కాంగ్రెస్ నాయకుల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.