TG: గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. కోర్టు తీర్పుపట్ల సీఎం రేవంత్ చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. సర్కార్ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని.. యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.