మలయాళ మూవీ అసోసియేషన్ ‘అమ్మ’ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై మోహన్‌లాల్ స్పందించారు. ‘అధ్యక్షుడు అనేది ఒక పదవి మాత్రమే. ఏదైనా సమస్య వస్తే దానికి అధ్యక్షుడు ఒక్కడే కారణమా?. చాలామంది నాతో పాటు తన కార్యనిర్వాహక కమిటీలోని ఇతర సభ్యులను శుత్రువుల్లా చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేనెప్పుడూ అమ్మకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను’ అని తెలిపారు.