ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం పాఠశాలలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను మంత్రి స్వామి పరిశీలించారు. ఇవాళ ఆయన పాఠశాలలోనే కాకుండ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లతో అనేక సాంఘిక సంక్షేమ హాస్టల్ మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు.