ADB: భీంపూర్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన భగవాన్పూర్కు రహదారి సమస్యపై విచారణకు వెళ్లిన అధికారులు వాగు దాటాల్సి వచ్చింది. గ్రామంలో ఇటీవల 108 వాహనం చేరకపోవడంతో గిరిజన మహిళ సహజ ప్రసవం జరగడం వల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలనకు దారితీసింది. ఈ మేరకు అధికారులు ఆశా, అంగన్వాడీ, వెల్నెస్ సిబ్బంది నుంచి సమాచారం సేకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.