VZM: భోగాపురం మండలం ముంజేరు జనసేన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2,46,244 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే మాధవి మంగళవారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జొన్నాడ గ్రామానికి చెందిన అట్టాడ ఈశ్వరమ్మకు రూ.1,15,600, కొల్లాయివలసకు చెందిన బంగారమ్మకు రూ.1,30, 644 మంజూరు అయ్యిందన్నారు. ఆపదలో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.