అనంతపురంలో రేపు జరగనున్న ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు లక్షల మందికి పైగా పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీనులయ్యే వేదికను సిద్ధం చేశారు. సభా ప్రాంగణంతోపాటు, నగరాన్ని మొత్తం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సభ విజయవంతం అయ్యేందుకు ఎస్పీ జగదీశ్ పకడ్బందీగా చర్యలు చేపట్టారు.