CTR: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ధృతి హాల్లో గురువారం ఉదయం 9 గంటలకు అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ – 2025 ఫైనల్ రౌండ్ కార్యక్రమం జరుగుతుందని వర్సిటీ కార్యాలయం పేర్కొంది. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు చెందిన 18 కాలేజీల నుంచి 220 మంది విద్యార్థినిలు పాల్గొంటారని తెలియజేశారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.