AP: మెడికల్ కాలేజీల వ్యవహారంపై YCPది అనవసరపు రాద్ధాంతమని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తామని.. YCP నేతలు కూడా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. ప్రైవేట్ వాళ్లనూ ప్రోత్సహించేందుకే PPP మోడ్లో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ఐదేళ్ల ముందే కాలేజీలు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం లేదన్నారు.